శర్వానంద్–శ్రీనువైట్ల ప్రాజెక్టుకి అదే పెద్ద సమస్యగా మారిందా?

by Pulgam srinivas |

శ్రీను వైట్ల, శర్వానంద్ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తో రూపొందించాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దాంతో నిర్మాతలు భయంతో వెనక్కు తగ్గినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శర్వానంద్–శ్రీనువైట్ల ప్రాజెక్టుకి అదే పెద్ద సమస్యగా మారిందా?
X

దిశ, వెబ్ డెస్క్: శర్వానంద్-శ్రీను వైట్ల కాంబో మూవీ స్టార్ట్ కాకముందే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కొంతకాలం క్రితం శర్వానంద్ 'నారి నారి నడుమ మురారి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్‌కు శ్రీను వైట్ల కూడా విచ్చేశారు. ఆ సందర్భంలో శర్వానంద్, మరికొన్ని రోజుల్లో శ్రీను వైట్లతో సినిమా చేయబోతున్నాను, ఆ చిత్రం అద్భుతంగా ఉంటుంది. దానిని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేస్తాం అని ప్రకటించారు. దీనితో చాలామంది వీరి సినిమా చాలా తక్కువ రోజుల్లోనే స్టార్ట్ అవుతుందని ఫిక్స్ అయ్యారు.

ఇంతలోపే ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీను వైట్ల చిత్రం అంటే భారీ తారాగణం, అద్భుతమైన టెక్నీషియన్స్, ఫారెన్ లొకేషన్స్ ఉంటాయి. ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల ఫామ్‌లో లేడు. మరోవైపు చూస్తే శర్వానంద్ 'నారి నారి నడుమ మురారి'తో హిట్ కొట్టిన తాజాగా వచ్చిన 'బైకర్' చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్‌ను అందుకోలేకపోయాడు. శ్రీను వైట్ల, శర్వానంద్ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తో రూపొందించాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దాంతో నిర్మాతలు భయంతో వెనక్కు తగ్గినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story