- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ కు షాక్... ఆ హీరోతో కొత్త మూవీ చేస్తున్న కొరటాల శివ ?
దేవర 2ను ఇప్పుడే తీసుకురాకూడదని అనుకుంటున్నారట. ఆ సినిమాకు బ్రేక్ ఇచ్చి నాగచైతన్య తో సినిమా చేసేందుకు కొరటాల శివ ప్లాన్

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరటాల శివకు మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఆచార్య విషయంలో కొన్ని తప్పిదాల కారణంగా సినిమా పెద్దగా ఆడలేదు. ఇక మిగిలిన సినిమాలన్నీ.. బంపర్ హిట్ అయ్యాయి. అడవులు, ప్రజలు, నీళ్లు ఇలా అన్నిటిని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తూ ఉంటారు కొరటాల శివ. ప్రకృతి అతనికి సినిమా కథగా మారిపోతుంది.
ఇందులో భాగంగానే సముద్రం చుట్టూ జరిగే కార్యకలాపాలపై జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సినిమా చేశారు కొరటాల శివ. ఈ సినిమా పార్ట్ 1 అదిరిపోయింది. అతి త్వరలోనే పార్ట్ 2 కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మధ్యలోనే కొరటాల శివ వదిలేసినట్లు చెబుతున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఉందట. జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అంటే జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఇది ఎదురు దెబ్బ.
అందుకే ఇలాంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవర 2 సినిమాను ఇప్పుడే తీసుకురాకూడదని అనుకుంటున్నారట. ఆ సినిమాకు బ్రేక్ ఇచ్చి.. అక్కినేని నాగచైతన్య తో సినిమా చేసేందుకు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఒకవేళ నాగచైతన్య ఒప్పుకోకపోతే... మరో కొత్త హీరోతో కూడా కొరటాల శివ సినిమా చేయాలని అనుకుంటున్నారట. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దేవర 2 కు వెళ్లాలని ప్లాన్ చేశారట. దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.






