ఎన్ని ప్లాన్స్ వేసినా ఆ మూవీ విషయంలో ఫెయిల్యూర్ అవుతున్న దిల్ రాజు

by Pulgam srinivas |

శతమానం భవతి నెక్స్ట్ పేజీ విషయంలో దిల్ రాజు ప్లాన్ బెడిసి కొట్టిందా..

ఎన్ని ప్లాన్స్ వేసినా ఆ మూవీ విషయంలో ఫెయిల్యూర్ అవుతున్న దిల్ రాజు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో పక్కా ప్లానింగ్ ఉన్న నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన చాలా సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. డిస్ట్రిబ్యూటర్గా పయనాన్ని మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత నిర్మాతగా మారారు. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా కొనసాగుతున్నారు. కొంతకాలం క్రితం కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో DRD (దిల్ రాజు డ్రీమ్స్) అనే సంస్థను స్థాపించాడు. ఇలా ఓ ప్లానింగ్తో ముందుకు వెళుతున్న ఈయనకు ఓ సినిమా విషయంలో మాత్రం ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

అది ఏ చిత్రం విషయంలో అనుకుంటున్నారా? శతమానంభవతి సీక్వెల్ విషయంలో... ఈ చిత్రం 2017వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. శర్వానంద్, అనుపమ పరమేశ్వరం జంటగా నటించిన ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మించాడు. శతమానం భవతి విడుదలైన కొన్ని సంవత్సరాలకు ఈ చిత్రానికి సీక్వెల్గా శతమానం భవతి నెక్స్ట్ పేజీని రూపొందించనున్నట్లు వార్తలు వచ్చాయి.

దాంతో చాలామంది ఇందులో కూడా శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తారని అనుకున్నారు. కానీ ఇందులో దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ చిత్రానికి సంబంధించిన అధికారిక పోస్టర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను ఈ సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు, ఈ చిత్రం అప్డేట్ రాలేదు. దిల్ రాజు ప్రస్తుతం ఈ సినిమాపై దృష్టి పెట్టాడా లేదా అనేది కూడా స్పష్టత లేదు. ఏదేమైనా కూడా శతమానం భవతి మూవీ లవర్స్ మాత్రం శతమానం భవతి నెక్స్ట్ పేజీ ఎప్పుడూ వస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Next Story