హైకోర్టును ఆశ్రయించిన హర్షసాయి... కారణం ఇదే !

by velandi.Saikiran |

తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ( Telangana State High Court ) ఆశ్రయించారు యూట్యూబర్ హర్ష సాయి (YouTuber Harsha Sai ). బెట్టింగ్ యాప్

హైకోర్టును ఆశ్రయించిన హర్షసాయి... కారణం ఇదే !
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ( Telangana State High Court ) ఆశ్రయించారు యూట్యూబర్ హర్ష సాయి (YouTuber Harsha Sai ). బెట్టింగ్ యాప్ కేసులో ( Betting app case ) హైకోర్టును ఆశ్రయించాడు. పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్ లలో తన పైన నమోదు అయిన కేసులను వెంటనే కొట్టివేయాలని... పిటిషన్ దాఖలు చేశారు యూట్యూబర్ హర్ష సాయి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని... రుజువులు లేని కేసులు పెడుతున్నారని... హర్ష సాయి పిటిషన్ దాఖలు చేశారు. తన పిటీషన్ పై వెంటనే తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి.. తనకు న్యాయం చేయాలని కోరారు.


అయితే రేపు హర్ష సాయి పిటిషన్.. తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అటు హర్ష సాయి పై పంజాగుట్ట ( Panjagutta, ), మియాపూర్ ( Miyapur ) పోలీస్ స్టేషన్ లలో వేరు వేరుగా బెట్టింగ్ యాప్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ కేసుల నేపథ్యంలో..... తనను అరెస్టు చేస్తారని భయంతో... పోలీసులకు చిక్కకుండా.. విదేశాల్లో హర్ష సాయి ఉంటున్నారని మొన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హర్ష సాయితో (YouTuber Harsha Sai ) పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న.. పలుగురు యూట్యూబర్ల పైన (YouTubers ) కూడా కేసులు నమోదు అయ్యాయి. అందులో కూడా కొంత మంది విదేశాల్లో దాక్కునట్లు తెలుస్తోంది. వాళ్లను అరెస్టు చేసేందుకు లుక్ అవుట్ నోటీసులు ( Lookout notices ) కూడా పోలీసులు జారీ చేశారు.

Next Story