- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయిన హర్ష రోషన్ కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే?
ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్న యువ హీరో, కోర్ట్ ఫేమ్ హర్ష రోషన్ తాజాగా మరో సినిమాకు సిద్ధం అయ్యాడు.

దిశ, సినిమా: ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్న యువ హీరో, కోర్ట్ ఫేమ్ హర్ష రోషన్ తాజాగా మరో సినిమాకు సిద్ధం అయ్యాడు. లెజెండరీ దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ స్థాపించిన ‘ఈవీవీ’ బ్యానర్‌పై ఈవీవీ గారి తనయుడు ఆర్యన్ రాజేష్ మరో నిర్మాత ఎన్.వి.కృష్ణారెడ్డితో కలిసి ఎంతో ప్రతిష్టాత్మంగా ఈ సినిమాను నిర్మంచబోతున్నారు. నిజ జీవిత కథ ఆధారంగా ఓ ఇంటెన్స్ లవ్ డ్రామాగా తెరకెక్కుతోన్న చిత్రంలో హర్ష్ రోషన్ సరసన ప్రియాంక ఆచర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు. నిజ జీవిత భావోద్వేగాలు, సంబంధాల నేపథ్యంలో ఈ ప్రేమకథను రూపొందించారు. తాజాగా ఈ సినిమా శుభ ముహూర్తంలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. త్వరలోనే చిత్రీకరణ స్టార్ట్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈవీవీ సినిమా, ఎన్‌వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వాస్తవికత, తీవ్ర భావోద్వేగాలు, బలమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుందని హామీ ఇస్తున్నారు టీమ్.






