- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనిల్ గీలా కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు.. ధైర్యం చెప్పి ఓదార్పు
‘మై విలేజ్ షో’ ఫేమ్ అనిల్ గీలా తండ్రి ఇటీవల మృతి చెందడంతో మాజీ మంత్రి హరీష్ రావు వారి కుటుంబాన్ని ఇవాళ పరామర్శించారు

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘మై విలేజ్ షో’ (My Village Show) ఫేమ్ అనిల్ గీలా కుటుంబాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) పరామర్శించారు. అనిల్ గీలా తండ్రి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ హరీష్ రావు దర్గపల్లిలోని అనిల్ గీలా నివాసానికి వెళ్లారు.
అండగా ఉంటానని భరోసా..
సిద్దిపేట జిల్లా నంగునూర్ (Nangunur) మండల పరిధిలోని దర్గపల్లి (Dargapally) గ్రామంలోని అనిల్ గీలా స్వగృహానికి చేరుకున్న హరీష్ రావు, తొలుత మృతి చెందిన అనిల్ తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అనిల్ గీలాను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తండ్రిని కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు హరీష్ రావు పేర్కొన్నారు. తమ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనిల్ గీలా తన వినూత్న వీడియోలతో తెలంగాణ సంస్కృతిని, గ్రామీణ జీవనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, ఇలాంటి క్లిష్ట సమయంలో ఆయనకు ధైర్యం చెప్పడం తమ బాధ్యతని హరీష్ రావు అన్నారు.






