హరిహర వీరమల్లు టికెట్లు ఓపెన్.. ధర పెరిగిన ఫుల్ డిమాండ్

by Yella Dhawani Reddy |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా 'హరిహర వీరమల్లు (Harihara veeramallu)'.

హరిహర వీరమల్లు టికెట్లు ఓపెన్.. ధర పెరిగిన ఫుల్ డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా 'హరిహర వీరమల్లు (Harihara veeramallu)'. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ జులై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర యూనిట్ అడ్వాన్స్డ్ బుకింగ్స్‌ను ప్రారంభించింది. ఇప్ప‌టికే ఏపీలో టికెట్ బుకింగ్స్ మొద‌ల‌వ్వ‌గా.. తాజాగా తెలంగాణ‌లో కూడా అందుబాటులోకి వ‌చ్చాయి.

ప్రీమియమ్ రేట్లతో టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా మల్టీప్లెక్సులు, ఏ-సెంటర్లలో టికెట్ ధరలు సాధారణానికి మించిన స్థాయిలో ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఈ పెరిగిన ధరలపై అసంతృప్తి లేకపోయినా, తమ అభిమాన హీరోను ఫుల్ స్క్రీన్‌లో చూడాలని టికెట్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. దీంతో టికెట్లు హాట్ కేకుల్లా బుక్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.

Next Story