- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరిహర వీరమల్లు సరికొత్త రికార్డు.. అక్కడ 135 థియేటర్లలో షోలు !
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో.. టాప్ మో

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో.. టాప్ మోస్ట్ హీరోగా కొనసాగుతున్నాడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందించుకొని... తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇందులో భాగంగానే తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే జులై 24వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దీనికోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హరిహర వీరమల్లు రిలీజ్ కానున్న నేపథ్యంలో... ఓ అరుదైన రికార్డు సాధించింది ఈ మూవీ.
ఉత్తరాంధ్రలో... హరిహర వీర మల్లు సినిమా రికార్డు స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఉత్తరాంధ్రలో మొత్తం 150 థియేటర్లు ఉంటే... 135 థియేటర్లలో ఒక రోజు మొత్తం ఈ హరిహర వీరమల్లు సినిమా ఆడనుంది. అలాగే ఒక వారం రోజుల పాటు... 125 థియేటర్లలో.. పవన్ కళ్యాణ్ బొమ్మ ఆడనుంది. ఇలా ఒకే సినిమా.. వారం మొత్తం ఆడడం ఇదే తొలిసారి. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్... ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు.
Also Read..
నాకు ఇష్టం లేదు.. రత్నం గారి కోసం ప్రెస్ మీట్: పవన్ కల్యాణ్






