- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో హరిహర వీరమల్లు ప్రీమియర్ షో.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఫ్యాన్స్ హంగామా
ఏఎం రత్నం నిర్మాతగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందిన ‘హరిహర వీరమల్లు’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఏఎం రత్నం నిర్మాతగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందిన ‘హరిహర వీరమల్లు’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా పవన్ అభిమానులు ఎప్పటి నుంచో కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇక హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (RTC Cross Roads)లో పవన్ కల్ట్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద కాసేపట్లో ప్రీమియర్ షో (Premiere Show) ప్రారంభం కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్తగా క్రౌడ్‌ను కంట్రోల్ చేసేందుకు భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. పుష్ప మూవీ విడుదల సందర్బంగా జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా థియేటర్ లోపల, బయటకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రీమియర్ షోకు టికెట్ ఉన్న వారినే లోనికి అనుమతిస్తుండటంలో పరిస్థితి అదుపులో ఉంది.






