- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మనల్ని ఎవడ్రా ఆపేది’.. హరిహర వీరమల్లు చిత్రబృందం ట్వీట్
కలెక్షన్లపై రకరకాల వార్తలు వినిపిస్తున్న వేళ సోషల్ మీడియా వేదికగా హరిహర వీరమల్లు చిత్రబృందం(Harihara Veeramallu Film) కీలక ప్రకటన చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: కలెక్షన్లపై రకరకాల వార్తలు వినిపిస్తున్న వేళ సోషల్ మీడియా వేదికగా హరిహర వీరమల్లు చిత్రబృందం(Harihara Veeramallu Film) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సోషల్ మీడియా అధికారిక ఖాతా ద్వారా పోస్టు పెట్టింది. మనల్ని ఎవడ్రా ఆపేది.. అన్ని థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా సినిమా ప్రదర్శితమవుతోంది. కొన్ని ఛేంజెస్ తర్వాత ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అని చిత్రబృందం ప్రకటించింది. కాగా, సినిమా అభిమానులతో పాటు స్వయంగా పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ నుంచి కూడా VFX పై విమర్శలు వచ్చాయి. దీంతో చేసేదేం లేక చిత్రబృందం కొన్ని మార్పులు చేసింది. యాక్షన్ సీన్‌లో చిన్నచిన్న మార్పులు చేశారు. క్లైమాక్స్ నిడివి కూడా బాగా తగ్గింది. ఇలా మొత్తంగా 10 నుంచి 15 నిమిషాల ఫుటేజీని సినిమా నుంచి తొలగించారు. ప్రస్తుతం థియేటర్లలో ఈ సవరించిన వెర్షనే ప్రదర్శితమవుతోంది. జులై 24న థియేటర్లలో విడుదలైన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్(Nidhi Agarwal)గా నటించింది. ఫ్యాన్స్ వలన ఫస్ట్ మూడు రోజులు బాగానే కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.






