- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harihara Veeramallu: ఫైనల్లీ ఇట్స్ అఫీషియల్.. రెండు రోజులు ముందుగానే ఓటీటీలోకి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’.

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా.. ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం.. భారీ అంచనాల మధ్య జులై 24న థియేటర్స్‌లో రిలీజైంది. కానీ, ఊహించిన రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో.. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.
దీంతో నిర్మాతలకు సైతం నష్టాలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ‘హరిహర వీరమల్లు’ చిత్రం రిలీజై ఇంకా నెల కూడా కాముందే ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకోగా.. ఆగస్టు 22 నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు గత కొద్ది రోజులుగా నెట్టింట వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. అయితే.. రెండు రోజులు ముందుగానే స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటిస్తూ.. ‘తిరుగుబాటు, కోపం.. అండ్ నీతి కథ.. థియేటర్లలో స్టార్ట్ అయిన తుఫాను ఇప్పుడు మీ స్క్రీన్లను ఆక్రమించింది.. ఆగస్టు 20 నుండి హరిహరవీరమల్లు స్వోర్డ్ vs స్పిరిట్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లోకి మాత్రమే రాబోతుంది’ అంటూ ప్రకటించారు.






