సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన హరిహర వీరమల్లు నిర్మాత

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-30 10:13:38  IST  )

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని.. హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమా నిర్మాత ఎంఎం రత్నం (MM Ratnam) శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన హరిహర వీరమల్లు నిర్మాత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని.. హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమా నిర్మాత ఎంఎం రత్నం (MM Ratnam) శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సినిమా టికెట్ల ధరలతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు నిర్మాణ సంస్థ ఎక్స్(C)లో పోస్ట్ చేసింది. హరిహర వీరమల్లు సునిమా 17వ శతాబ్దానికి సంబంధించిన కథతో రూపొందించినట్లు నిర్మాత సీఎంకు వివరించారని ఆ పోస్ట్ పేర్కొంది. జూన్ 12న విడుదల కానున్న ఈ సినిమా టికెట్ల ధరల పెంపుపై కూడా సీఎంతో చర్చించగా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తన విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఎంఎం రత్నం సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్షన్లో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ గా హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్ గా నటిస్తోంది.

Next Story