- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు వైజాగ్‌లో హరిహరవీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం హరిహరవీరమల్లు. ఈ సినిమాకు క్రిష్ మరియు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం హరిహరవీరమల్లు. ఈ సినిమాకు క్రిష్ మరియు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. చిత్రంలో నిధి అగర్వాల్ పవన్ కల్యాణ్‌కు జోడీగా నటించింది. జూలై 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుపుతోంది.
పవన్ కల్యాణ్ సైతం రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇక రేపు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ వైజాగ్‌లో జరగనుంది. బీచ్ రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 4 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఈవెంట్‌కు పవన్ కల్యాణ్‌తో పాటు చిత్రయూనిట్ మొత్తం హాజరవుతుంది. ఇక ఇప్పటికే హైదరాబాద్‌లో ఓసారి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. రేపు వైజాగ్‌లో నిర్వహించడంతో అక్కడి అభిమానులు కుషీ అవుతున్నారు.






