- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hari Hara Veera Mallu : భారీగా పడిపోయిన 'హరిహరవీరమల్లు' కలెక్షన్లు
నటుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన 'హరిహరవీరమల్లు'(Harihara Veeramallu) సినిమాకు కలెక్షన్లు భారీగా పడిపోయాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన 'హరిహరవీరమల్లు'(Harihara Veeramallu) సినిమాకు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు ఐదవ రోజున ప్రపంచవ్యాప్తంగా కేవలంరూ. 2.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఇప్పటివరకు వసూలైన మొత్తం రూ.108 కోట్ల గ్రాస్ అంటే 52 శాతమే కావడంతో, భారీ నష్టాలే మూటగట్టుకోనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమాకు మిక్స్డ్ టాక్ రావడం ఒక కారణం అయితే, యానిమేషన్ మూవీ 'మహావతార్ నరసింహ' సూపర్ హిట్ టాక్ తో దూసుకు వెళ్లడం కూడా మరో కారణం అని తెలుస్తోంది. అలాగే వీక్ డేస్ కావడం కూడా HHVM కలెక్షన్లు దారుణంగా పడిపోవడానికి మరో కారణం అని ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది. ఎ.ఎం రత్నం ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.
Next Story






