రీఎంట్రీ ఇచ్చిన హీరో అబ్బాస్.. ‘హ్యాపీ రాజ్’ టీజర్‌తో హైప్

by Sujitha Rachapalli |

టైటిల్ అనౌన్స్‌మెంట్‌ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి సినీ వర్గాల్లో చర్చల్లో నిలుస్తున్న చిత్రం ‘హ్యాపీ రాజ్’. ప్రమోషన్స్ పరంగా వినూత్నంగా వెళ్తుంది చిత్ర యూనిట్.

రీఎంట్రీ ఇచ్చిన హీరో అబ్బాస్.. ‘హ్యాపీ రాజ్’ టీజర్‌తో హైప్
X

దిశ, సినిమా : టైటిల్ అనౌన్స్‌మెంట్‌ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి సినీ వర్గాల్లో చర్చల్లో నిలుస్తున్న చిత్రం ‘హ్యాపీ రాజ్’. ప్రమోషన్స్ పరంగా వినూత్నంగా వెళ్తున్న చిత్ర యూనిట్ తాజాగా అధికారిక తెలుగు ప్రోమోను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేయించింది. సినిమా స్టోరీ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేసింది. డిఫరెంట్ స్టైల్ మేకింగ్‌తో విడుదలైన కొద్ది సమయంలోనే సోషల్ మీడియా వేదికలో ఈ వీడియో వైరల్ అయింది.

జయవర్ధన్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్‌గా మారియా ఎలాంచెజియన్ దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ టైటిల్ పాత్రలో నటిస్తుండగా.. రిఫ్రెషింగ్ విజువల్స్, లైట్ హ్యూమర్, హాయిగా సాగే టోన్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అనుభూతిని అందించబోతోందనే నమ్మకాన్ని ప్రోమో బలంగా కలిగిస్తోంది. ఇక ఈ సినిమాతో ఒకప్పటి హీరో అబ్బాస్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Next Story