హ్యపీ బర్త్‌డే.. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ అతనికి విష్ చేసిన హీరోయిన్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు

by I. Sairam |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Agarwal) ‘లక్ష్మీ కళ్యాణం’(Lakshmi Kalyanam) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

హ్యపీ బర్త్‌డే.. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ అతనికి విష్ చేసిన హీరోయిన్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Agarwal) ‘లక్ష్మీ కళ్యాణం’(Lakshmi Kalyanam) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బిజినెస్ మ్యాన్ అయినటువంటి గౌతమ్ కిచ్లూను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాగే ఓ బాబుకు జన్మ కూడా నిచ్చింది. దీంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ ‘సత్యభామ’(Satyabhama) మూవీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

రీసెంట్‌గా ‘సికిందర్’(Sikinder) సినిమాతో మనముందుకు వచ్చింది. ప్రస్తుతం తెలుగులో కన్నప్ప సినిమాతో పాటు బాలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో తన కొడుకుతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ..‘స్నాక్ నెగోషియేషన్స్ CEO, నిద్రవేళ ఆలస్యం చేసే మాస్టర్, బ్రోకలీని జిగటగా భావిస్తూ బురద రుచిగా భావించే ఏకైక వ్యక్తికి 3వ పుట్టినరోజు శుభాకాంక్షలు.

నువ్వే మా కంటికి ఆపిల్, మా చిన్న సుడిగాలి, మా ఆత్మలో నవ్వు, మా కాఫీలో శక్తి! మీరు మా ప్రపంచాన్ని అత్యంత ఉల్లాసంగా, హృదయాన్ని కరిగించే వ్యక్తి.. నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు కాజల్ కుమారుడుకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.

Next Story