- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోకు రక్షణగా హనుమంతుడు.. ఆకట్టుకుంటున్న వానర ఫస్ట్ లుక్ పోస్టర్
అవినాశ్ తిరువీధుల హీరోగా అండ్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వానర’.

దిశ, సినిమా: అవినాశ్ తిరువీధుల హీరోగా అండ్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వానర’. ఇందులో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ కాగా.. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సోషియో ఫాంటసీ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని శంతను పతి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో అవినాశ్ బైక్‌పై వెళ్తుండగా, ఆయనను రక్షణగా హనుమంతుడు వెంటే వెళ్తున్న స్టిల్ ఆసక్తి కలిగిస్తోంది. ‘వానర’ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మూవీ టీమ్. ఈ సినిమాలో ఖడ్గం పృథ్వీ, కోన వెంకట్, సత్య, ఆమని, శివాజీ రాజా, ఛమ్మక్ చంద్ర, రచ్చ రవి, తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.






