- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విడాకులు తీసుకున్న మరో టాలీవుడ్ జంట..!
జీవి ప్రకాష్ ( GV Prakash Kumar) అలాగే సైందవి ( Saindhavi ) తాజాగా విడాకులు తీసుకున్నారు. 2013 సంవత్సరంలో తన స్కూల్

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఇప్పటికే ఈ చిత్ర పరిశ్రమలో చాలా మంది విడాకులు తీసుకున్న జంటలు ఉన్నాయి. మొదట ప్రేమించి పెళ్లి చేసుకోవడం... ఆ తర్వాత చిన్నచిన్న కారణాలవల్ల విడిపోవడం జరుగుతోంది. హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య విడాకుల తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి.
అయితే తాజాగా మరో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన జంట విడాకులు తీసుకుంది. జీవి ప్రకాష్ ( GV Prakash Kumar) అలాగే సైందవి ( Saindhavi ) తాజాగా విడాకులు తీసుకున్నారు. 2013 సంవత్సరంలో తన స్కూల్ ఫ్రెండ్ సైంధవిని ప్రేమ వివాహం చేసుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్, ప్రముఖ నటుడు జీవి ప్రకాష్. ఇక వీళ్లిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉంది. చిన్నచిన్న కారణాలవల్ల విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని చెన్నై హైకోర్టులో ఈ జంట పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇద్దరి అంగీకారం ఉందన్న నేపథ్యంలో చెన్నై హైకోర్టు ( Chennai Family Court ) కూడా విడాకులు మంజూరు చేసింది.






