- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mrunal Thakur: అబ్బాయిలు నేను ఆయన హీరోయిన్‌ను.. హార్ట్ సింబల్ జత చేసి మృణాల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
బుల్లితెర సీరియల్స్ ద్వారా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్(Mrunal Thakur) ‘సీతారామం’ (Sita Ramam)సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.

దిశ, సినిమా: బుల్లితెర సీరియల్స్ ద్వారా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్(Mrunal Thakur) ‘సీతారామం’ (Sita Ramam)సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. మొదటి చిత్రంలోనే ఈ అమ్మడు తన నటనతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాకుండా సంప్రదాయ లుక్‌లో కనిపించి మెస్మరైజ్ చేసింది. ఇక ఆ తర్వాత తెలుగు, హిందీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. తెలుగులో ‘హాయ్ నాన్న’ తో హిట్ సాధించింది. ఇక గత ఏడాది మృణాల్ ‘కల్కి’(kalki) మూవీతో ఘన విజయం తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘డెకాయిట్’ (Dacoit)చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఓ వైపు షూటింగ్స్‌లో పాల్గొంటూనే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మృణాల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. డేవిడ్‌తో ఫొటో షేర్ చేస్తూ.. ‘‘అబ్బాయిలు ఈ విషయం గుర్తు పెట్టుకోండి. నేను డేవిడ్ ధావన్ హీరోయిన్‌ను. మీతో కలిసి ఫొటో దిగినందుకు చాలా కృతజ్ఞురాలిన సార్’’ అనే క్యాప్షన్ జత చేసింది. అలాగే రెడ్ కలర్ హార్ట్ సింబల్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా మూవీ ప్రకటన కావచ్చు అని అభ్రిప్రాయ పడుతున్నారు. ఇక గత రెండు రోజుల నుంచి మృణాల్, సుమంత్ పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే మృణాల్ ఇలాంటి పోస్ట్ పెట్టడంతో అది కాస్త వైరల్ అవుతోంది.






