- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘గువ్వల చెరువు ఘాట్’తో ఓటీటీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు.

దిశ, సినిమా: బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘గువ్వల చెరువు ఘాట్’తో ఓటీటీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో తనకంటూ స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్న భరత్ కమ్మ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ప్రసిద్ధ ‘గువ్వల చెరువు ఘాట్’ ప్రాంతం ఆధారంగా ఒక ఇంటెన్స్ పొలిటికల్ రివేంజ్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ మేరకు ముంబై వేదికగా జరిగిన ‘Prime Video Presents 2026’ గ్రాండ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘గువ్వల చెరువు ఘాట్’ నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది. విడుదలైన గ్లింప్స్‌లో కిరణ్ అబ్బవరం మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. ఇందులో సంయుక్త మీనన్, ‘మసూద’ ఫేమ్ తిరువీర్, సీనియర్ నటుడు సిద్ధిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ద్వారా 2026లో ఓటీటీ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. భరత్ కమ్మ మార్క్ మేకింగ్ అండ్ పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్‌పై అంచనాలను భారీగా పెంచుతున్నాయి.






