- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sonal Chauhan: గల్ఫ్ సంక్షోభం: దుబాయ్‌లో చిక్కుకున్న సోనాల్ చౌహాన్, మోడీకి విజ్ఞప్తి
ప్రముఖ బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ దుబాయ్‌లో చిక్కుకుపోయారు. భారత్‌కు తిరిగి వెళ్లేందుకు మార్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో విమాన సర్వీసులు దాదాపు నిలిపివేశారు. దీంతో ప్రముఖ బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ దుబాయ్‌లో చిక్కుకుపోయారు. భారత్‌కు తిరిగి వెళ్లేందుకు మార్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన సోనాల్, ‘ ప్రధాని నరేంద్ర మోడీ జీ.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుత సంక్షోభం కారణంగా నేను దుబాయ్‌లో చిక్కుకున్నాను. విమాన సర్వీసులు రద్దయ్యాయి. భారత్‌కు తిరిగి రావడానికి సరైన మార్గం లేదు. దయచేసి నాకు సురక్షితంగా స్వదేశానికి చేరుకునేలా సహకారం అందించండి’ అని కోరారు.
భారత పౌరుల భద్రతపై కేంద్రం దృష్టి
కొన్ని రోజుల క్రితం దుబాయ్ వెళ్లిన సోనాల్, అక్కడే ఈ అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుపోయినట్లు సమాచారం. మరోవైపు, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీ.వి. సింధు కూడా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పలువురు భారతీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భారత పౌరుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.






