ఎవరూ ఊహించని ఒక యుద్ధం.. దివాలా అంచున ఉన్న ఒక దేశం..

by Chukka Sudharani |   (  Updated:2026-05-07 15:50:53  IST  )

‘ది కేరళ స్టోరీ’ సినిమాతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ బ్యూటీ అదా శర్మ.. మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది

ఎవరూ ఊహించని ఒక యుద్ధం.. దివాలా అంచున ఉన్న ఒక దేశం..
X

దిశ, సినిమా: ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ బ్యూటీ అదా శర్మ.. మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ‘ది కేరళ స్టోరీ’ నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షాతో కలిసి ఆమె చేస్తున్న మూడో ప్రాజెక్టు ‘గవర్నర్: ది సైలెంట్ సేవియర్’ను ఇటీవల అనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్చపరిచింది. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తో మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేసింది అదా. ‘దివాలా అంచున ఉన్న ఒక దేశం.. ఎవరూ ఊహించని ఒక యుద్ధం.. దానిని పతనం కానివ్వడానికి నిరాకరించిన ఒక వ్యక్తి. ది సైలెంట్ సేవియర్.. గవర్నర్ టీజర్ వచ్చేసింది’ అంటూ షేర్ చేసిన ఈ టీజర్‌కు నెట్టింట మంచి స్పందన లభిస్తుంది. చిన్మయ్ డి మండలేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. విపుల్ అమృత్‌లాల్ షా నిర్మిస్తున్న ఈ హై వోల్టేజ్ డ్రామా జూన్ 12, 2026న థియేటర్స్‌లోకి రానుంది.

Read more..పెళ్లి ఫిక్స్ అయ్యింది.. ఫ్రీడమ్ పోయింది

Next Story