నిర్మాతలకు భారీ షాక్.. సినిమా టికెట్ల రేట్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-07 15:27:54  IST  )

సినిమా ప్రియులకు(Movie Lovers) కర్ణాటక ప్రభుత్వం(Government of Karnataka) భారీ శుభవార్త అందించింది.

నిర్మాతలకు భారీ షాక్.. సినిమా టికెట్ల రేట్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా ప్రియులకు(Movie Lovers) కర్ణాటక ప్రభుత్వం(Government of Karnataka) భారీ శుభవార్త అందించింది. సినిమా టికెట్ల రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి రాష్ట్రంలో విడుదలయ్యే ఏ సినిమా(Movie) అయినా సరే టికెట్(Movie Ticket Rates) ధర రూ.200 మించకూడదని ధర పరిమితిని విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్ల(Movie)పై ధర పరిమితి రూ.200 మించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన ఉల్లంఘించొద్దని మల్టీఫ్లెక్స్‌లను కూడా హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని ఉత్తర్వు్ల్లో పేర్కొన్నది. అయితే, ఒక రకంగా ఇది మూవీ లవర్స్‌ శుభవార్త కాగా, భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసే నిర్మాతలకు(Producers) మాత్రం షాకింగ్ న్యూస్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా, ఇటీవల చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశంలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కూడా కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పుష్ప-2 మూవీ(Pushpa-2 Movie) విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోనిం సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద తొక్కిసలాట జరుగడంతో బెనిఫిట్‌ షో(Benefit Show)లను రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సినిమాటోగ్రఫీ చట్టం(Cinematography Act) ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 నుంచి ఉదయం 8.40 వరకూ సినిమాలను ప్రదర్శించటానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బెనిఫిట్ షోలతో పటు టికెట్ల ధరలపై కూడా పరిమితులు విధించింది.

Next Story