కింగ్‌డమ్ సినిమాలో అదే హైలైట్..లీక్ చేసిన డైరెక్టర్

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమా ఈనెల 32న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు విడుదల నేపథ్యంలో వాయిదా వేశారు.

కింగ్‌డమ్ సినిమాలో అదే హైలైట్..లీక్ చేసిన డైరెక్టర్
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమా ఈనెల 32న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు విడుదల నేపథ్యంలో వాయిదా వేశారు. కింగ్ డమ్ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచాయి. ఇక సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి హీరో విజయ్ దేవర కొండ మరియు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో కలిసి ఓ స్పెషల్ ఇంటర్యూ నిర్వహించారు. ఇందులో ఒకరికొకరు ప్రశ్నలు వేసుకున్నారు. కాగా సినిమాలో హైలెట్ సీన్ ఏంటని డైరెక్టర్ గౌతమ్‌ను ప్రశ్నించగా..జైలు ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందన్నారు. ఆ సీన్ మొత్తం 30 నిమిషాల పాటు సాగుతుందని, అది కూడా వర్షంలో ఉంటుందని చెప్పారు. ఆ సీన్ల కోసం చాలా కష్టపడ్డానని విజయ్ దేవరకొండ కూడా తెలిపారు. ఆ సీన్ చేయడానికి వర్షంలో కాళ్లు జారడంతో ప్రత్యేకమైన షూ ధరించి చేశానని చెప్పారు.

Next Story