- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gorati Venkanna: తెలుగు సాహిత్యంతో పాటు సంస్కృతి, భక్తి కలగలిపిన చిత్రం ‘శివ శంభో’: గోరటి వెంకన్న
అనంత్ ఆర్ట్స్ పతాకంపై డైరెక్టర్ నర్సింగ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘శివ శంభో’ (Shiva Sambho).

దిశ, సినిమా: అనంత్ ఆర్ట్స్ పతాకంపై డైరెక్టర్ నర్సింగ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘శివ శంభో’ (Shiva Sambho). ఈ సినిమాతో కృష్ణ ఇస్లావత్, కేశవర్థిని బేబీ రిషిత హీరో, హీరోయిన్లుగా పరిచయం కాబోతున్నారు. తనికెళ్ల భరణి, సుమన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను రాజ గోపాల్, దోరవేటి సుగుణ నిర్మిస్తున్నారు. తాజాగా ‘శివ శంభో’ సినిమా పోస్టర్‌ను ప్రముఖ గాయకుడు, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న చిత్ర బృందం సమక్షంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా గోరటి వెంకన్న (Gorati Venkanna) మాట్లాడుతూ.. ‘తెలుగు సాహిత్యం (Literature) సంస్కృతి (culture)తో పాటు అన్ని హంగులతో ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌కి తప్పకుండా వస్తాను. మంచి కాన్సెప్ట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందని కోరుకుంటున్నా’ అని తెలుపుతూ.. చిత్ర బృందానికి, దర్శకుడు నర్సింగ్‌ను అభినందించి ఆశీర్వదించారు. ఇక ఈ సినిమాను మహా శివరాత్రి (Maha Shivratri)కి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డైరెక్టర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు నర్సింగ్, రచయిత దోరవేటితో పాటు నటీనటులు వేణు, బేబీ రిషిత, ఎన్. రమేశ్ యాదవ్, అమరేంద్ర, కో ప్రొడ్యూసర్ శ్రీశైలం రెడ్డి, మేనేజర్ చిట్టి బాబు, టెక్నీషియన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.






