- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gopichand: కొత్త సినిమా ప్రకటించిన గోపీ చంద్.. ఇక మొదలుపెడుతున్నాం అంటూ పోస్ట్
గతేడాది ‘భీమా’, ‘విశ్వం’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాచో స్టార్ గోపీచంద్ (Gopichand)..

దిశ, సినిమా: గతేడాది ‘భీమా’, ‘విశ్వం’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాచో స్టార్ గోపీచంద్ (Gopichand).. ప్రస్తుతం విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్(Exciting project)ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ హిస్టారికల్ ఎపిక్ మూవీని తాజాగా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ మూవీలో గోపీచంద్ నెవర్ బిఫోర్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ ప్రజెంట్ సెట్‌పై ఉండగానే గోపీ చంద్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
గోపీచంద్ తన నెక్ట్స్ మూవీ కోసం కొత్త డైరెక్టర్ కుమార్ మ్యాస్టిక్ (Kumar Mystic)తో చేతులు కలిపాడు. మంచి కాన్సెప్ట్, కొత్త జానర్‌లో రూపొందబోతున్న ఈ చిత్రాన్ని SVCC పై నిర్మిస్తున్నట్లు తెలుస్తుంగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ మాచోస్టార్ తన X అకౌంట్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. ‘ఇక మొదలుపెడుతున్నాం.. నా తదుపరి సినిమా కోసం SVCCOfficial తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న MysticBoom (కుమార్ మ్యాస్టిక్)తో ఈ సినిమా చేయడం సంతోషం. అతనితో మూవీ చేసేందుకు ఎదురు చూస్తున్నాను’ అంటూ పూజా కార్యక్రమాలు జరిగిన ఫొటోలు పోస్ట్ చేశాడు హీరో. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
We begin!
— Gopichand (@YoursGopichand) April 24, 2025
Excited to team up with @SVCCOfficial on my next, directed by the debutant @MysticBoom
Looking forward to it...) pic.twitter.com/oeQMUCrhEp






