అనాది కాలం నాటి అపురూప గాథ.. ‘గోపీచంద్ 33’ టైటిల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Chukka Sudharani |

మ్యాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్ అప్డేట్ వచ్చేసింది.

అనాది కాలం నాటి అపురూప గాథ.. ‘గోపీచంద్ 33’ టైటిల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం ‘గోపీచంద్ 33’తో బిజీగా ఉన్నాడు. ‘ఘాజీ’ వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్‌గా కనిపించనుండగా, శ్రీనివాస చిట్టూరి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఘనంగా స్టార్ట్ అయిన ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన వార్తలు రాగా.. తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘అనాది కాలం నుండి ఒక అపురూప గాథ ఆవిర్భవిస్తోంది.. Gopichand33 టైటిల్ గ్లింప్స్ ఏప్రిల్ 13న రాబోతుంది’ అని తెలిపారు. కాగా.. 7వ శతాబ్దానికి చెందిన, చరిత్రలో పెద్దగా వెలుగులోకి రాని ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తుండగా.. దీనికి ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారా అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Next Story