G2: డైరెక్టర్ పుట్టినరోజు.. మోస్ట్ వెయిటెడ్ మూవీ నుంచి గ్లింప్స్ అప్డేట్

by Chukka Sudharani |

అడివి శేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘గూఢచారి’ ఒకటి.

G2: డైరెక్టర్ పుట్టినరోజు.. మోస్ట్ వెయిటెడ్ మూవీ నుంచి గ్లింప్స్ అప్డేట్
X

దిశ, సినిమా: అడివి శేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘గూఢచారి’ ఒకటి. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ మూవీని అభిషేక్ అగర్వాల్, అభిషేక్ నామ, టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా.. శోభితా ధూళిపాళ్ల, మధు శాలిని, ప్రకాష్ రాజ్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో వచ్చిన ఈ చిత్రం కేవలం రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 30 కోట్ల వసూళ్లు రాబట్టింది.

ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా గూఢచారి-2 (Goodachari2) రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్‌కు వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అడివి శేష్ హీరో కాగా.. ఇమ్రాన్ హష్మి, మధు శాలిని, వామికా గబ్బి, సుప్రియ యార్లగడ్డ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా డైరెక్టర్ వినయ్ కుమార్ సిరిగినీడి బర్త్‌డే కావడంతో ఈ సందర్భంగా ఆయనకు విష్ చేస్తూ G2 అప్డేట్ ఇచ్చాడు అడివి శేష్.

‘ప్రియమైన నా మిత్రుడు వినయ్ కుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ దర్శకత్వంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. నేను ఇప్పటివరకు పనిచేసిన అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులలో మీరు ఒకరు. వచ్చే ఏడాది మీరు సృష్టించే #G2 బాక్స్ ఆఫీస్ రాక్షసుడిని చూసి అభిమానులు ఆశ్చర్యపోతారు. మనం ఏం చేశామో చూడటానికి ప్రపంచంతో పాటు నేను కూడా చాలా ఎగ్జైటింగ్‌గా వేచి చూస్తున్నాను. మీకు లవ్‌తో మంచి రోజు తిరిగి రావాలని కోరుకుంటున్నాను’ అని తెలిపాడు. అలాగే G2 థండర్ గ్లింప్స్ ఈ ఆగస్టులో మీ ముందుకు వస్తోంది అంటూ తెలిపారు. లింక్


Next Story