విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ముగింపు దశలో 'జన నాయగన్' సెన్సార్ పనులు

by Pulgam srinivas |

విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చివరి దశలో సెన్సార్ పనులు.

విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ముగింపు దశలో జన నాయగన్ సెన్సార్ పనులు
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తాజాగా ‘జన నాయగన్’ చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమాను ముందుగా సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా భారీ స్థాయిలో ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. అయితే ఆఖరి నిమిషంలో ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు పూర్తికాకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడింది.

చాలా కాలంగా సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇలాంటి సమయంలో తాజాగా విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ప్రస్తుతం ‘జన నాయగన్’ చిత్రానికి సంబంధించిన సెన్సార్ ప్రక్రియ చివరి దశలో ఉందని, త్వరలోనే సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ వచ్చే అవకాశముందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. సెన్సార్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక విడుదల తేదీని ప్రకటించనున్నట్లు సమాచారం.

అన్నీ అనుకున్నట్లు జరిగితే సమ్మర్ సీజన్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా విజయ్ నటిస్తుండగా, హీరోయిన్‌గా పూజ హెగ్డే కనిపించనున్నారు. కీలక పాత్రలో మమితా బైజు నటించగా, విలన్ పాత్రలో బాబీ డియోల్ నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం హెచ్ వినోత్ వహించగా, KVN ప్రొడక్షన్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, జగదీష్ పళనిసామి, లోహిత్ ఎన్.కె నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించారు.

Next Story