Thandel : "తండేల్" కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవబోతున్న "తండేల్"(Thandel) నిర్మాతలకు భారీ గుడ్ న్యూస్.

Thandel : తండేల్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవబోతున్న "తండేల్"(Thandel) నిర్మాతలకు భారీ గుడ్ న్యూస్. టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం(AP Govt) సానుకూలంగా స్పందించింది. చిత్ర బృందం చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని సినిమా టికెట్ ధరలు(Ticket Prices) పెంచుకునేలా అనుమతి ఇచ్చింది. ఏపీలోని అన్ని సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్స్ లో జీఎస్టీతో కలిపి రూ.75 పెంచుకునేలా ఆదేశాలు జారీ చేసింది. సినిమా విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు ఈ అదనపు ధరలు అమల్లో ఉంటాయి. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్(Geetha Arts) బ్యానర్ పై బన్నీ వాసు(Bunni Vasu) నిర్మాణంలో చందూ మొండేటి(Chandu Mondeti) డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో సూపర్ హిట్ జోడీ అయిన నాగ చైతన్య- సాయి పల్లవి(Sai Pallavi) నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్(DSP) సంగీతం అందిస్తున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించామని సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకలో ప్రకటించి ప్రేక్షకుల్లో ఇంకా భారీ అంచనాలే పెంచింది చిత్ర బృందం. మరో మూడు రోజుల్లో విడుదలవబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి. కాగా ఇప్పటికే విడులైన పాటలు క్రేజీగా అలరిస్తున్నాయి.

Next Story