- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్మిక ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ది గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి(Dheekshith Shetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend).

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి(Dheekshith Shetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend). ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్(Geetha Arts), మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని(Dheeraj Mogilineni) ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) రూపొందిస్తున్నారు.
ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా ఈ మూవీ సెప్టెంబర్ 5న థియేటర్లలో రాబోతుంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారగా.. రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Link






