- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్పులేం లేవ్.. అనుకున్న డేట్‌కే పవన్ కల్యాణ్ సినిమా విడుదల!
సినిమా విడుదల తేదీల్లో క్లారిటీ లేక సతమతమవుతున్న పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు ఎట్టకేలకు ఓ శుభవార్త వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: సినిమా విడుదల తేదీల్లో క్లారిటీ లేక సతమతమవుతున్న పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు ఎట్టకేలకు ఓ శుభవార్త వచ్చింది. ఆయన నటిస్తున్న సినిమాల్లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రమైన హరిహర వీరమల్లు నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ ‘VD12’, నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమాల విడుదల తేదీలు కూడా ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) విడుదల తేదీనాడే(మార్చి 28) ఉండటంతో అందరూ పవన్ కల్యాణ్ విడుదల వాయిదా పడిందని భావించారు. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ కూడా కొంత భాగం మిగిలి ఉంది. పవన్ కల్యాణ్ కూడా షూటింగ్‌లకు గ్యాప్ ఇచ్చి ప్రభుత్వ కార్యక్రమాల్లో విస‌్తృతంగా పాల్గొంటున్నారు. ఇప్పుడప్పుడే షూటింగ్‌కు పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే అందరూ పవన్ సినిమా వాయిదా పడుతుందని గట్టిగా ఫిక్స్ అయ్యారు.
అయితే.. తాజాగా హరిహర వీరమల్లు నుంచి విడుదలైన పోస్టర్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సహాన్ని నింపుతోంది. వీరమల్లు ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం(AM Rathnam) పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం విషెస్ చెబుతూ ట్వీట్ పెట్టింది. ఇందులో HHVM మార్చి 28నే విడుదల చేస్తామని పేర్కొన్నారు. దీంతో ఎలాంటి మార్పు లేకుండా సినిమా అనకున్న తేదీనే విడుదలకు సిద్ధం కావడంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా మిగిలిన భాగం షూటింగ్‌కు పవన్ కల్యాణ్ డేట్స్ సర్దుబాటు చేశారట. అతి త్వరలో సెట్స్‌లోకి రానున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం సగం భాగాన్ని డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) పూర్తి చెయ్యగా.. మిగిలిన భాగానికి ఏఎమ్ రత్నం కుమారుడు జ్యోతి కృష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. హరిహర వీరమల్లుతో పాటు సుజిత్ దర్శకత్వంలో ఓజీ, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్నారు. హరిహర వీరమల్లు తర్వాత ఆ రెండు సినిమాలకు కూడా డేట్స్ ఇచ్చి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం.
Finally, after being in production for five years, #PawanKalyan's #HariHaraVeeraMallu is hitting the screens on March 28th – the best release date of this year! pic.twitter.com/jEBnDmDEXM
— Daily Culture (@DailyCultureYT) February 4, 2025






