NTR-Prashanth Neel: ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-02-21 12:40:31  IST  )

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ఇటీవల ‘దేవర’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

NTR-Prashanth Neel: ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ఇటీవల ‘దేవర’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇటీవల ప్రశాంత్ నీల్(Prashant neel), ఎన్టీఆర్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie makers) నిర్మిస్తుండగా.. కన్నడ నటి రుక్మిణి వసంత్(Rukmini Vasant) హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. అయితే ఈ మూవీ నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ రెగ్యులర్ షూట్ మొదలైనట్లు తెలుపుతూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘‘భారతీయ సినిమా చరిత్రలో ఓ మార్క్‌ని క్రియేట్ చేసేలా ఈ మట్టి ఎట్టకేలకు తన పాలనను స్వాగతించింది. ఎన్టీఆర్-నీల్ మూవీ అధికారికంగా మొదలైంది. ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త యాక్షన్ వినోదంతో సిద్ధమవుతోంది’’ అని రాసుకొచ్చారు. అలాగే ప్రశాంత్ నీల్ యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన తారక్ అభిమానులు ఆనందపడుతున్నారు. ఈ సారి ఫుల్ మీల్స్ ఖాయం అని కామెంట్లు చేస్తున్నారు.

Next Story