- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ‘డెకాయిట్’ టికెట్ ధరలు
‘డెకాయిట్’ చిత్ర టికెట్ ధరలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా తగ్గించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. తగ్గించిన ధరలు రేపటి నుండి అమల్లోకి రానున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: అడవి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా రూపొందిన ‘డెకాయిట్’ చిత్రం ఏప్రిల్ 10వ తేదీన విడుదలైంది. ఈ సినిమాకు పరవాలేదనే స్థాయి టాక్ రావడంతో మంచి కలెక్షన్లను సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఇదిలా ఉండగా, తాజాగా ఈ మూవీ యూనిట్ ప్రేక్షకులకు శుభవార్త అందించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ ధరలను భారీగా తగ్గిస్తూ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో తగ్గించిన కొత్త టికెట్ ధరలు అమల్లోకి రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలను రూ.105 మరియు రూ.70గా నిర్ణయించారు.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.105, రూ.80, రూ.50గా ఫిక్స్ చేశారు. ఇక మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధరను రూ.150గా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇటీవల కాలంలో టికెట్ ధరలు అధికంగా ఉండటమే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రాకపోవడానికి ఒక కారణమనే వాదనను అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా టికెట్ ధరలను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గించారు. మరి తగ్గిన టికెట్ ధరల కారణంగా ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరుగుతాయా లేదా అనేది చూడాల్సి ఉంది. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించగా, సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మాతలుగా వ్యవహరించారు.






