Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు శుభవార్త.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ట్వీట్

by Hamsa |   ( Updated:2025-04-15 12:32:11.0  )
Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు శుభవార్త.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ట్వీట్
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. కొత్త సినిమాలన్నీ మరోసారి థియేటర్స్‌లోకి వచ్చి ఊహించని విధంగా హిట్ సాధిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందుకు అంతగా మెప్పించని చిత్రాలు కూడా రీరిలీజ్‌తో దూసుకుపోతూ బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతున్నాయి. అయితే ప్రతి నెల కనీసం ఒక మూవీ అయినా విడుదల అవుతుంది. ఇక ఏప్రిల్ నెలలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన హిట్ మూవీ ‘భరత్ అనే నేను’( BharatAneNenu)సినిమా థియేటర్స్‌లోకి రాబోతుంది. కొరటాల శివ (Koratala Shiva)దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటించగా.. ప్రకాష్ రాజ్(Prakash Raj), పోసాని క్రిష్ణ మురళి, ఆమని వంటి వారు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా 2018లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.

ఇప్పుడు మళ్లీ ‘భరత్ అనే నేను’ మరోసారి థియేటర్స్‌లోకి రాబోతుండటం విశేషం. ఏప్రిల్ 26న ఈ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. అయితే త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ కాబోతున్నట్లు మూవీ మేకర్స్ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘SSMB-29’. రాజమౌళి దర్శకత్వంలో రాబోతుండగా.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మహేష్ బాబు సరసన నటించనుంది. అయితే షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈ చిత్రం గురించే వచ్చే వార్తల వల్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story

Most Viewed