‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ట్రైలర్ రిలీజ్.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో గూస్ బమ్స్ తెప్పిస్తున్న హీరో అజిత్

by I. Sairam |   (  Updated:2025-08-02 09:12:05  IST  )

స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ట్రైలర్ రిలీజ్..  సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో గూస్ బమ్స్ తెప్పిస్తున్న హీరో అజిత్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. అలాగే తెలుగులోనూ మంచి మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ ఏజ్‌లో కూడా యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly). 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్(Trisha Krishnan) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్(Sunil), అర్జున్ దాస్(Arjun Das), రాహుల్ దేవ్(Rahul Dev) కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన అజిత్ ఫస్ట్ లుక్, టీజర్, ఇతర పోస్టర్లు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ వీడియో ఆడియన్స్‌కు గూస్ బమ్స్ తెప్పిస్తోంది.

ఇక ట్రైలర్‌ను చూస్తుంటే.. మాస్ కంటెంట్‌తో రూపొందినట్లు అర్థమవుతోంది. రెండు నిమిషాల ఈ వీడియోలో క్రేజీ యాక్షన్ రైడ్‌ను చూపించారు డైరెక్టర్ అధిక్‌ రవిచంద్రన్‌. అలాగే హీరో అజిత్‌ను వివిధ గెటప్స్‌లో, డిఫరెంట్ లుక్స్‌లో ప్రెజెంట్ చేశారు. ఓవైపు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో చూపిస్తూనే, మరోవైపు స్టైలిష్ యంగ్ లుక్‌లో ఆశ్చర్యపరిచారు. టైటిల్‌కు తగ్గట్లుగానే హీరో పాత్రలో భిన్నమైన కోణాలున్నట్లు తెలుస్తోంది.

Next Story