Ajith Kumar: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సెకండ్ సింగిల్ అప్డేట్.. అంచనాలు పెంచేస్తున్న మేకర్స్ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-26 03:37:53  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.

Ajith Kumar: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సెకండ్ సింగిల్ అప్డేట్.. అంచనాలు పెంచేస్తున్న మేకర్స్ ట్వీట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన మూవీ ‘విదాముయార్చి’(Vidaamuyarchi). ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్‌లోకి వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. త్రిష హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం అజిత్ కుమార్, త్రిష కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అతిక్ రవిచంద్రన్(Athik Ravichandran) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్(Sunil), రాహుల్ దేవ్, యోగిబాబు(Yogi Babu), ఫైన్ టామ్ చాకో, రఘురామ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదలై ప్రేక్షకుల్లో హైప్ పెంచాయి. ఇక ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 10న విడుదల కాబోతుంది. తాజాగా, మూవీ మేకర్స్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly) అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సాంగ్ ‘‘గాడ్ బ్లెస్ యూ’’ ప్రోమోను రిలీజ్ చేస్తూ పూర్తి పాట రేపు ఉగాది కానుకగా రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. జీవీ ప్రకాష్ కుమార్, అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సాంగ్ మూవీకే హైలెట్‌గా నిలవబోతున్నట్లు సమాచారం. ఇక ఈ పోస్ట్‌కు మూవీ మేకర్స్ ‘‘మా అజిత్ కుమార్ కోసం రెండు సంగీత శక్తి కేంద్రాలు చేతులు కలిపాయి’’ అనే క్యాప్షన్ జత చేసి క్రాకర్స్ ఎమోజీలు షేర్ చేశారు. అంతేకాకుండా ఫైరింగ్ ఫొటోను కూడా పెట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Video Link

Link

Next Story