‘గోదారి గట్టుపైన’ బంగారు బొమ్మ

by Chukka Sudharani |

‘మేమ్ ఫేమస్’తో విజయాన్ని అందుకున్న సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు.

‘గోదారి గట్టుపైన’ బంగారు బొమ్మ
X

దిశ, సినిమా: ‘మేమ్ ఫేమస్’తో విజయాన్ని అందుకున్న సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ బ్రీజ్ గ్లింప్స్, చూడు చూడు, ‘ఓ మై గాడ్’ సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ థర్డ్ సింగిల్ బంగారు బొమ్మ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ పాట మార్చి 13న రిలీజ్ కానుంది. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ లవ్లీ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి నాగ వంశీ కృష్ణ మ్యూజిక్ అందిస్తుండగా.. రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story