- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mowgli: 25ఏళ్లు కూడా నిండని ఓ ప్రేమికుడు పోరాటం.. విశేష స్పందన సొంతం చేసుకుంటున్న గ్లింప్స్
రోషన్ కనకాల నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ’ నుంచి తాజాగా ది వరల్డ్ ఆఫ్ మోగ్లీ గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.

దిశ, సినిమా: రోషన్ కనకాల నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ’ నుంచి తాజాగా ది వరల్డ్ ఆఫ్ మోగ్లీ గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘ఒక చిన్న ప్రేమ కథ చెప్తా’ అంటూ నేచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన ఈ గ్లింప్స్‌లో.. ‘టెక్నాలజీ ఇంకా డెవలప్ కానీ టైమ్‌లో ఒకడు.. 30 మందిని తిండి నిద్ర లేకుండా పరిగెత్తించాడు. గ్యాంగ్‌స్టరో, స్మగ్లరో కాదు 25 ఏళ్లు కూడా నిండని ఓ ప్రేమికుడు.. ఎందుకు అనుకుంటున్నారా.. తన బంగారు ప్రేమలో వేలు పెడితే కుట్టడా.. కొట్టడా’ అంటూ సాగిన ఈ గ్లింప్స్‌లో ప్రేమ కోసం ఏదైనా చేసే ప్రేమికుడిగా రోషన్ క్యారెక్టర్ యూత్‌ను ఆకట్టుకుంటుంది.
ఫైనల్‌గా ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంటూ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుంది. కాగా.. ఈ సినిమాకు కలర్ ఫొటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అప్డేట్ రావాల్సి ఉంది. లింక్






