- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘k-ర్యాంప్’ నుంచి గ్లింప్స్.. స్పెషల్ పోస్టర్‌తో మరింత హైప్ పెంచేశారుగా..
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), యంగ్ బ్యూటీ యుక్తి తరేజా(Yukti Thareja) జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కె-ర్యాంప్’(K-Ramp).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), యంగ్ బ్యూటీ యుక్తి తరేజా(Yukti Thareja) జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కె-ర్యాంప్’(K-Ramp). ఈ సినిమాను జైన్స్ నాని(Jains Nani) డైరెక్ట్ చేస్తుండగా హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మక్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా రీసెంట్‌గా ఈ మూవీ నుంచి గ్లింప్స్ జూలై 14న రిలీజ్ చేస్తున్నట్లు ఓ అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా ప్రకటించారు.
ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి హీరో క్రేజీ పోస్టర్ షేర్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఈరోజు సాయంత్రం 4:05 నిమిషాలకు అని రాసుకొస్తూ పోస్ట్ పెట్టారు. ఇక పోస్టర్‌లో కిరణ్ అబ్బవరం లుంగీ కట్టుకుని చేతిలో మందు బాటిల్ పట్టుకొని పైన చూస్తున్నాడు. ఇక అతని చుట్టూ హార్ట్ సింబల్‌తో ఫైర్ అంటుకుని ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ గ్లింప్స్ పై మరింత హైప్ పెంచేసింది. Link






