- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్న ఘట్టమనేని వారసుడు.. రంగంలోకి టాప్ ప్రొడక్షన్స్..!
ఇప్పటికే ఘట్టమనేని కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించారు.

దిశ, సినిమా: ఇప్పటికే ఘట్టమనేని కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించారు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పించారు. ఇక ఇప్పుడు ఘట్టమనేని వారసుడు హీరోగా ఎంట్రీ ఇస్తునట్లు సమాచారం. ఆయనెవరో కాదు.. దిగ్గజ నటుడు కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు(Ramesh Babu) కుమారుడు జయ కృష్ణ(Jaya Krishna) ఘట్టమనేని ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్లు సమాచారం. యునైటెడ్ స్టేట్స్‌లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి ఎంట్రీకి రెడీ అవుతున్న జయకృష్ణ ఇటీవల చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే.
బాబాయ్ మహేష్ బాబు(Mahesh Babu) వలె తన ముద్ర వేయడానికి సిద్ధమయ్యాడు. ఇన్నాళ్లు కథలు విన్న జయకృష్ణ ఓ స్టోరీని ఒకే చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను అజయ్ భూపతి తెరకెక్కించనుండగా.. వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు బాబాయ్ లాగా హిట్స్ సాధించాలని శుభాకాంక్షలు చెబుతున్నారు.






