Sitara: ఉగాది పండుగ సందర్భంగా షాప్ ఓపెనింగ్‌కు వెళ్లనున్న ఘట్టమనేని గారాలపట్టి సితార.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

by Kodari Anjali |

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార క్రేజ్ అంతా ఇంతా కాదు.

Sitara:  ఉగాది పండుగ సందర్భంగా షాప్ ఓపెనింగ్‌కు వెళ్లనున్న ఘట్టమనేని గారాలపట్టి సితార.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) గారాల పట్టి సితార క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. అభిమానుల్ని అలరిస్తుంటుంది. వెకేషన్స్, ఫంక్షన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంచుకుంటుంది. సితార(Sitara)కు ఈ వయస్సులోనే హీరోయిన్ లెవల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడం నిజంగా విశేషమని చెప్పుకోవచ్చచు.

తండ్రికి తగ్గ కుమార్తెగా మంచి పేరు సంపాదించుకుంటుంది. సితార ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో తండ్రితో కలిసి ఓ పాటకు దుమ్ము లేచిపోచే స్టెప్పులేసి.. అభిమానుల్ని ఆకట్టుకుంది. ఇకపోతే ఈ అమ్మడు ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ పీఎంజేకి బ్రాండ్ అంబాసిడర్‌(PMJ Brand ambassador)గా కూడా వ్యవహరిస్తుంది. పీఎంజే ప్రమోషనల్ యాడ్‌లో ఫొటో షూట్ చేసి జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో సితార కలెక్షన్‌ను ఆవిష్కరించింది. సితార బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న విషయం టాక్ ఆఫ్ టాలీవుడ్‌గా మారింది.

సూపర్ స్టార్ గారాల పట్టి అతి పెద్ద యాడ్ కాంట్రాక్ట్‌కు సైన్ చేసి.. ఇలాంటి అరుదైన రేర్ ఫీట్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ స్టార్ కిడ్‌గా సితార నిలిచింది. అయితే గతంలో యాడ్ చేసి పీఎంజే జ్యువెలర్స్ మరో కొత్త బ్రాండ్ ఓపెన్ చేసేందుకు సిద్ధంగా ఉంది. కాగా దీనికి బ్రాండ్ అంబాసిడర్ అయిన సితార ఈ షాప్ ఓపెనింగ్‌కు వస్తుందట. రేపు (మార్చి 30) ఉదయం 10 గంటలకు హైదరాబాదు పంజాగుట్టలోని కొత్త పీఎంజే జ్యువెల్లర్ షోరూంను సితార స్టార్ట్ చేయనుందట. ఈ వార్త విన్న సూపర్‌‌స్టార్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story