మరో శంకరాభరణం.. ‘ఘంటసాల ది గ్రేట్’

by Sujitha Rachapalli |   (  Updated:2025-12-06 18:18:34  IST  )

టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు, కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న ఘంటసాల వెంకటేశ్వర రావు బయోపిక్ గ్రాండ్‌గా తెరకెక్కింది. ‘ఘంటసాల ది గ్రేట్’గా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగ్గా..

మరో శంకరాభరణం.. ‘ఘంటసాల ది గ్రేట్’
X

దిశ, సినిమా : టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు, కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న ఘంటసాల వెంకటేశ్వర రావు బయోపిక్ గ్రాండ్‌గా తెరకెక్కింది. ‘ఘంటసాల ది గ్రేట్’గా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగ్గా.. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ చిత్రం మరో శంకరాభరణం అవుతుందని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మాణ సారథ్యంలో సి.హెచ్. రామారావు రచన, దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా.. గాయకుడు కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించారు. సుమన్ ముఖ్య పాత్రను పోషించారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు టైటిల్ రోల్ ప్లే చేసిన కృష్ణ చైతన్య, దర్శకుడు సి.హెచ్. రామారావు, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత శోభారాణి, నిర్మాత ఫణి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్, చదలవాడ శ్రీనివాస్, రేలంగి నరసింహారావు తదితరులు హాజరయ్యారు.

Next Story