నేటి తరాన్ని ఆకట్టుకోనున్న ‘ఘంటసాల ది గ్రేట్’ మూవీ

by Chukka Sudharani |

ఘంటసాల జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ‘ఘంటసాల ది గ్రేట్’(Ghantasala the Great) చిత్రాన్ని తెరకెక్కుతుంది.

నేటి తరాన్ని ఆకట్టుకోనున్న ‘ఘంటసాల ది గ్రేట్’ మూవీ
X

దిశ, సినిమా: సినీ సంగీత ప్రపంచంలో ఘంటసాల వేంకటేశ్వరరావు (ఘంటసాల) గురించి తెలియని వారు ఉండరు. ఇప్పుడు ఆయన జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ‘ఘంటసాల ది గ్రేట్’(Ghantasala the Great) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మాణ సారథ్యంలో సి.హెచ్. రామారావు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా.. సుమన్ ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేయబోతోన్నారు.

ఈ క్రమంలో శనివారం నాడు ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను ముఖ్య అతిథిగా హాజరైన ఆదిత్య హాసన్ లాంఛ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. ‘‘ఘంటసాల’ స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ మూవీని ప్రతీ ఒక్కరూ చూడండి. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 12న రానున్న ఈ సినిమాను అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

Next Story