అతనితో ప్రేమలో పడ్డాను.. పెళ్లంటే భయమేస్తోంది: రాఖీ

by Disha Web Desk 9 |
అతనితో ప్రేమలో పడ్డాను.. పెళ్లంటే భయమేస్తోంది: రాఖీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోసారి ప్రేమలో పడిందట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన నటి.. ‘నాకు రీసెంట్‌గా ఒకరు పరిచయం అయ్యారు. చాలా మంచి వ్యక్తి. అతనితో జీవితాన్ని పంచుకోవాలని ఉంది. కానీ, ఇప్పుడు సిద్ధంగా లేను. ఎందుకంటే నా మొదటి పెళ్లితో ఎన్నో తంటాలు పడ్డానో మీ అందరికీ తెలుసు. అందుకే పెళ్లి అంటే భయంగా ఉంది. విడాకుల డిప్రెషన్ నుంచి బయటపడేందుకు దుబాయ్ వెళ్లి వచ్చాను. ప్రస్తుతం మైండ్ పూర్తిగా సెట్ అయింది. హ్యాపీగా ఉన్నాను. జీవితంలో మనల్ని బాధపెట్టే వాళ్లు చాలామంది ఉంటారు. ఆ గాయాలకు మందు రాసేవారు కొందరే ఉంటారు. అలాంటి వారిని వదులుకోకుండా మనతోనే ఉంచుకుంటే మంచిది’ అని చెప్పుకొచ్చింది.

Read more: స్త్రీల దుస్తులే ధరించండి.. కొడుకులను వేధించిన స్టార్ నటి: పోస్ట్ వైరల్

Next Story

Most Viewed