- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గెట్ రెడీ.. D-55 నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ రాబోతుందంటూ మూవీటీమ్ పోస్ట్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అతను కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు తమిళంలో ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి, నిర్మించారు. ప్రజెంట్ ఆయన నటిస్తున్న సినిమాల్లో ‘D55’ ఒకటి. అమరన్ సినిమాతో హిట్టు అందుకున్న డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గోపురం ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీలో స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుందట. అయితే తాజాగా ఈ మూవీటీమ్ ఈ సినిమా నుంచి ఓ అనౌన్స్‌మెంట్ రాబోతుంది అని తన ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘ఇది గురువారం మాత్రమే కాదు.. ఇది ___ రోజు.. #D55 - ఈ సాయంత్రం 5 గంటలకు ప్రకటన ట్యూన్ అవుతుంది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.






