- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ స్టార్ హీరో సరసన జెనీలియా.. షూటింగ్‌లో జాయిన్ (పోస్ట్)
ఒకప్పుడు యూత్ కలల రాణిలో జెనీలియా (Genelia) ఒకరు. ‘బాయ్స్’ సినిమాతో వచ్చి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈమె..

దిశ, సినిమా: ఒకప్పుడు యూత్ కలల రాణిలో జెనీలియా (Genelia) ఒకరు. ‘బాయ్స్’ సినిమాతో వచ్చి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈమె.. దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే రితేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత జెనీలియా పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. మళ్లీ 10 ఏళ్ల గ్యాప్ తర్వాత ‘వేద్’ (Ved) మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి ఘన విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టింది జెన్నీ. ఇందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్(Aamir Khan) సినిమాలో నటిస్తుంది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ‘సితారే జమీన్ పర్’(Sitare Zameen Par) అనే చిత్రంలో అమీర్ ఖాన్ హీరో కాగా.. జెనీలియా దేశ్‌ముఖ్ హీరోయిన్‌గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీకి అమీర్ ఖాన్, కిరణ్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చింది. ఇందులో అమీర్ ఖాన్ అండ్ జెనీలియా మధ్య ఒక ప్రత్యేక పాటను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే అమీర్ ఖాన్ అందులో భాగం కాగా.. ముంబైలో జరుగుతున్న ఈ షూట్‌లో తాజాగా జెనిలీయా జాయిన్ అయింది. కాగా.. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మేలో థియేటర్లలోకి రానుందని తెలుస్తుంది. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రాలేదు.






