టాలీవుడ్ లో అతడే మొనగాడు.. 3 పేజీల డైలాగ్ కూడా ఒకేసారి !

by velandi.Saikiran |

టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా (Genelia D'Souza) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు టాలీవుడ్

టాలీవుడ్ లో అతడే మొనగాడు.. 3 పేజీల డైలాగ్ కూడా ఒకేసారి !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా (Genelia D'Souza) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత బాలీవుడ్ వెళ్ళిపోయింది జెనీలియా. బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ బ్యూటీ... 2012 వరకు టాలీవుడ్ ఇండస్ట్రీని దున్నేశారు. ఆ తర్వాత.. నటుడు రితేష్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.

ఇక ఇప్పుడు మళ్లీ సౌత్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు జెనీలియా. కిరీటి హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ జూనియర్. ఈ సినిమాలో శ్రీ లీల ( Sree Leela)హీరోయిన్. అయితే ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో జెనీలియా కనిపించబోతున్నారు. జూలై 18వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇలాంటి నేపథ్యంలో.. ప్రమోషన్స్ లో పాల్గొంటూ.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు జెనీలియా.

ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పై (NTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ జెనీలియా. టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గొప్ప నటుడు అని ప్రశంసించారు. మూడు పేజీల డైలాగున్నా కూడా ఒకేసారి చెప్పేస్తాడని... అలాంటి నటుడ్ని ఇంత వరకు చూడలేదని పేర్కొన్నారు. ఇక రామ్ చరణ్ కూడా అద్భుతమైన నటుడు అని ప్రశంసించారు. అల్లు అర్జున్ లో మంచి ఎనర్జీ ఉంటుందని గుర్తు చేశారు. దీంతో జెనీలియా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Next Story