- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Geetha Madhuri: అలాంటి శత్రువే నయం అంటూ గీతా మాధురి షాకింగ్ పోస్ట్.. ఎవరు మోసం చేశారంటూ నెటిజన్ల కామెంట్స్
టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురి ( Geetha Madhuri) ‘నచ్చావులే’ సినిమాలో నిన్నే నిన్నే కోరా అనే పాటతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురి ( Geetha Madhuri) ‘నచ్చావులే’ సినిమాలో నిన్నే నిన్నే కోరా అనే పాటతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాకుండా మొదటి పాటకే నంది అవార్డు అందుకుని అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత మాటీవీలో ప్రసారమైన సూపర్ సింగర్ అనే షోలో కూడా ఆమె పాల్గొంది. దీంతో గీతా మాధురికి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో మాస్ సాంగ్స్ పాడి స్టార్ సింగర్‌గా పాపుటారిటీ తెచ్చుకుంది. ఇక చివరగా ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ (Janata Garage)మూవీలో పాడింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆమె నటుడు నందు(Nandu)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే గత కొద్ది కాలంగా పాటలకు దూరం అయిన ఆమె పర్సనల్ లైఫ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది.
అలాగే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, గీతా మాధురి ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘మనం డిప్రెషన్‌లో ఉన్నా.. బాధలో ఉన్నా కూడా ఇతరుల అటెన్షన్‌ను కోరుకుంటాం. అలాంటప్పుడే మనం ట్రాప్‌లో పడిపోతాం. మన మైండ్ కలుషితం అవుతుంది. మనం ఎవరితో ఉంటున్నామో.. ఎవరితో చిల్ అవుతున్నామో .. ఎలాంటి వారితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నామో కాస్త జాగ్రత్తగా చూసుకోండి. చెడగొట్టే స్నేహితుడి కంటే.. మోటివేట్ చేసే శత్రువే నయం’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం గీతా మాధురి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు అవును మీరు చెప్పింది నిజమే.. మిమ్మల్ని ఎవరు మోసం చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు.






