- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెన్సార్ పూర్తి చేసుకున్న గాయపడ్డ సింహం
'గాయపడ్డ సింహం' మూవీకి సెన్సార్ బోర్డు నుండి "U/A" సర్టిఫికెట్ లభించింది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు మరియు నటుడు తరుణ్ భాస్కర్ తాజాగా గాయపడ్డ సింహం చిత్రంలో హీరోగా నటించాడు. ఈ సినిమాను మే 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ మూవీకి సెన్సార్ బోర్డు నుండి "U/A" సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటించగా, జేడీ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి స్వీకార్ అగస్తి సంగీతం అందించాడు. కళింగ క్రియేషన్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీపై జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.






